బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను బెదిరించడం కరెక్ట్ కాదు - శ్రీధర్ బాబు

Byline :  Kiran
Update: 2023-12-20 09:13 GMT

అధికార సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుతగలడంపై మంత్రి శ్రీధర్ స్పందించారు. సభాకార్యక్రమాలకు అడ్డుతగలడంతో పాటు స్పీకర్ ను బెదిరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం, స్పీకర్ ఛైర్ దగ్గరకు వచ్చి పదేపదే ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతిని బెదిరించడం రూల్స్ కు విరుద్ధమని చెప్పారు.

శ్వేతపత్రంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీకి దాదాపు 2 గంటల సమయం ఇచ్చామని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. క్లారిఫికేషన్ సమయంలో చెప్పాల్సిన విషయాలు చెప్పేందుకు అవకాశం దొరుకుతుందని అన్నారు. అంతేతప్ప బీఆర్ఎస్ సభ్యులందరూ స్పీకర్ను బెదిరించడం కరెక్టు కాదని హితవు పలికారు.

Tags:    

Similar News