కొత్త రేషన్ కార్డుల విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

By :  Bharath
Update: 2023-12-26 15:04 GMT

కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా పాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రులు చెప్పారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పదేళ్లు పాలించినా కొత్త కార్డులు జారీ చేయలేదని శ్రీధర్ బాబు ఫైరయ్యారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలనలో 6 గ్యారంటీల కోసం ప్రజలు ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

కొత్త రేషన్ కార్డుల విధివాధానాలు ఇంకా ఖరారు కాలేదని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాకే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే పించన్ తీసుకుంటున్నవారు మళ్లీ అప్లే చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలన గుర్తించి పథకాలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని అన్నారు.




Tags:    

Similar News