మేమూ రామభక్తులమే.. మంత్రి ఉత్తమ్

Update: 2024-01-13 15:52 GMT

తామూ రామభక్తులమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయోధ్యలో జరగబోయే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడతున్నారని మండిపడ్డారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారని విమర్శలు గుప్పించారు. రామమందిరం అంశాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. శంకరాచార్యులు, మఠాధిపతులు లాంటి వాళ్లు రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పాలని బండి సంజయ్ ను నిలదీశారు. ఇక రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో తాము 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టారని.. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధిస్తామని తెలిపారు.


Tags:    

Similar News