బీఆర్ఎస్ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించింది : Uttam Kumar Reddy

Byline :  Krishna
Update: 2024-01-21 12:36 GMT

పంచాయితీ రాజ్ వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో పీఆర్‌ఐ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేయడంతోపాటు సర్పంచ్‌ల అధికారాలను తొలగించారన్నారు. సంస్కరణల ముసుగులో పంచాయతీల ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించిందని మండిపడ్డారు. హుజూర్‌నగర్‌లో పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలుచేస్తామని చెప్పారు.

ఎంతో మంది సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపడితే బీఆర్ఎస్ బిల్లులు చెల్లించలేదని ఉత్తమ్ అన్నారు. దీంతో పలువురు సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి దాదాపు రూ.20 లక్షల వరకు బకాయి పడిందన్నారు. గతంలో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని విస్మరించిందని మండిపడ్డారు. 2019లో 2,134 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తమ సర్పంచ్‌లను ఎన్నుకోగా.. ఆ గ్రామాలకు రూ. 213.40 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News