గృహలక్ష్మీ పథకం దరఖాస్తు గడువుపై గందరగోళం.. మంత్రి క్లారిటీ

Update: 2023-08-09 14:43 GMT

గృహలక్ష్మి పథకం విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. గ్రామ కంఠంలో ఉన్న పేదలు ఎవరూ ఆందోళన చెందొద్దని.. ఈ పథకం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ పథకానికి చివరి తేదీ అంటూ ఏమిలేదని.. ఖాళీ స్థలం ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3 వేలు ఇళ్లను మంజూరు చేశామని.. మిగితావారు రెండో దశలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

లబ్దిదారులు ప్రజాప్రతినిధుల ద్వారా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఖాళీ స్థలం, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. కేవలం మహిళల పేరు పైనే నగదు ఇస్తామన్నారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కాగా ఈ పథకానికి రేపే చివరి తేదీ కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇక గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం వున్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయలను అందిస్తోంది.

Tags:    

Similar News