తెలంగాణ కోసం సోనియా గాంధీని ఒప్పించిన ఘనుడు : కోమటిరెడ్డి

Byline :  Krishna
Update: 2024-01-16 09:56 GMT

తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కృషి ఎనలేనిదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి, తుమ్మల నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం సోనియా గాంధీని ఒప్పించడానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగా తప్పక వస్తుందని.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని పదేపదే చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే అప్పట్లో ప్రచారం జరగ్గా.. జైపాల్ రెడ్డి మాత్రం అలాంటి ఉండదని భరోసా కల్పించారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టే అంశంపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.

జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారని మంత్రి తుమ్మల అన్నారు. ఆయన లేకపోవడం రాష్ట్రంతోపాటు దేశానికే లోటని చెప్పారు. స్టూడెంట్ లీడర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి జైపాల్ రెడ్డి చేసిన కృషి ఎవరు మరిచిపోరని చెప్పారు. జైపాల్ రెడ్డి పేరు మీద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Tags:    

Similar News