రాష్ట్రంలో మైనారిటీలకు అన్యాయం జరుగుతోంది: అసదుద్దీన్‌ ఓవైసీ

Update: 2023-06-27 12:53 GMT

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికల కోసం ప్రతి పార్టీ తమ వ్యూహాలను అమలు చేసే పనిలో పడ్డాయి. 2014 నుంచి బీఆర్ఎస్ కు మద్దతునిస్తూ వస్తున్న ఎంఐఎం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలతో ఈ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మతతత్వం పెరుగుతోందని అసదుద్దీన్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు భవనాలు కట్టి.. ఇస్లామిక్ సెంటరను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెట్రోను పాతబస్తీకి ఎందుకు విస్తరించట్లేదని నిలదీశారు. తమ కోసం ప్రభుత్వం పనిచేయట్లేదు కాబట్టే నిలదీస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడం మంచిదేనని.. అయితే ఇదంతా సీఎంగా కేటీఆర్ ను ప్రమోట్ చేయడం కోసం.. కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని అసదుద్దీన్ ఆరోపించారు.

ఉస్మానియా హాస్పిటల్ ను ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. దాని అభివృద్ది గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నిన్న (జూన్ 26) నిజామాబాద్ లో పర్యటించిన అసదుద్దీన్.. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎంఐఎం కూడా ప్రత్యామ్నాయమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News