మైనార్టీలకు రూ.లక్ష సాయం.. అప్లై చేసుకోండిలా

Update: 2023-07-29 03:22 GMT

బీసీలకు ఇచ్చినట్లుగానే.. మైనార్టీలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయించుకుంది. ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో రూ. లక్ష సాయం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు జూలై 31 నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేది ఆగస్టు 14గా నిర్ణయించారు. పథకానికి అర్హులైన వాళ్లు https: //tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ అప్లై చేసుకోవచ్చని వివరించారు.

ఆర్థిక సాయం మార్గదర్శకాలు:

* ముస్లింలకు మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ నుంచి, ఇతర మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సాయం అందజేస్తారు.

* తీసుకున్న ఆర్థిక సాయం.. పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకే అనుమతి.

* ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్ల లోపు వారు అర్హులు. అంతేకాకుండా ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుంది.

* వార్షిక ఆదాయం గ్రామాల్లో ఉన్నవారికి రూ.1.50 లక్షలు, పట్టణాల్లో నివసించేవారికి రూ.2 లక్షలు మించి ఉండరాదు.

* కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా మానిటరింగ్, స్క్రీనింగ్ కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎంపిక చేసిన జాబితా జిల్లా మంత్రుల ఆమోదం పొందాలి.

Tags:    

Similar News