ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ ఈరోజు తెల్లవారుఘామున మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేరడీ రచనలకు శ్రీరమణ ప్రసిద్ధి.
కథారచయితగా కూడా శ్రీరమణ చాలా ప్రసిద్ధి. సాక్షిలో అక్షర తూణీరం అనే పేరుతో చాలా ఏళ్ళు వ్యంగ్యభరిత వ్యాసాలు రాసారు. ఈయన రాసిన మిథునం కథ చాలా పాపులర్ అయింది. దీనినే తనికెళ్ళ భరణి సినిమాగా కూడా మలిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మిలు ఇందులో నటించారు. సినిమా నిర్మాణంలోనూ కూడా ఈయన సేవలు అందించారు.
శ్రీరమణ గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952లో జన్మించారు. అసలు పేరు కామరాజు రామారావు. కలం పేరు శ్రీరమణ. అసలు పేరు కన్నా కలం పేరుతోనే ఆయన చాలా పాపులర్ అయ్యారు.