శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం..!

Update: 2023-06-29 11:20 GMT

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న శేజల్ అనే మహిళ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ పెద్దమ్మతల్లి టెంపుల్ వద్ద శేజల్ స్పృహతప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. శేజల్ బ్యాగులో నిద్రమాత్రలను గుర్తించారు. మధ్యాహ్నం 1.30 సమయంలో శేజల్‌ను పెద్దమ్మతల్లి టెంపుల్ వద్దకు ఆమె వ్యాపార భాగస్వామి ఆదినారాయణ రావు డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది.




 


ఆరిజన్ డైయిరీ నిర్వాహకురాలైన శేజల్‌కు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడుంటూ శేజల్ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని శేజల్ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఆమె చనిపోయేందుకు ప్రయత్నించింది. ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద శేజల్‌ పురుగులు మందు ఆత్మహత్యాయత్నం చేశారు. మళ్లీ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డం సంచలనం రేపుతోంది. 

Tags:    

Similar News