పొన్నం ప్రభాకర్ ఓ ఆవేశం స్టార్..పాడి కౌశిక్ రెడ్డి

By :  Vinitha
Update: 2024-03-23 08:08 GMT

మంత్రి పొన్నం ప్రభాకర్ పై మరోసారి నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆవేశం చూస్తుంటే..ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని ఎద్దేవా చేశారు. ఆడియోలో ఎమ్మార్వోలతో మంత్రి మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నారు. ఆర్డీవోకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని..సీఎస్ కు ఫిర్యాదు చేస్తా అంటున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంను కూడా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో, ఎమ్మార్వోలకు తన నుంచి ఒక్క ఫోన్ కాల్ వెళ్లలేదని ఛాలెంజ్ చేశారు.

పొన్నం మరోసారి నోరుపారేసుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు బూతులను ఏడో గ్యారెంటీగా ఇస్తున్నారని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడంపై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా దానం నాగేందర్ ను ప్రకటించారని..ఇప్పటికైనా స్పీకర్ వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News