కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ ఎట్లొచ్చింది? - పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీయేనని ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యుత్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అప్పుడు ఎంపీలుగా ఉన్న తాము తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడామని చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్ లేడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లే స్వరాష్ట్ర కల నెరవేరిందని పొన్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం పోరాడితే బీఆర్ఎస్ వాళ్లు బతికుండగానే తనకు పిండ ప్రదానం చేశారని పొన్నం గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు. తెలంగాణ కోసం చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానన్న కేసీఆర్ కరీంనగర్‌లో ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.