తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందరికంటే ముందే బీఆర్ఎస్ 115మందితో తొలివిడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో టికెట్ రాని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పలువురు నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్యగా పరిస్థితి ఉంది. గులాబీ బాస్ ఈ సారి రాజయ్యకు కాకుండా కడియంకు టికెట్ ఇవ్వడంతో రాజయ్య ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలో కడియం శ్రీహరి, రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రాజయ్యకు సీఎం కేసీఆర్ సహా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో రాజయ్య శాంతించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ గారిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగ కలిసిన బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరి గారు యం.ఎల్.ఎ శ్రీ తాటికొండ రాజయ్య గారు మరియు యం.ఎల్.సి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. pic.twitter.com/VnPboANuz0
— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 22, 2023