బీజేపీ ఎల్పీ నేత ఫిక్స్.. సీనియర్కే అధిష్టానం మొగ్గు

Byline :  Bharath
Update: 2023-12-10 16:03 GMT

ఎంఐఎం పార్టీ సభ్యుడు అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా చేసినందుకు.. బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా బీజేపీ ఎల్పీ నేతగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి గెలిచిన వారిలో సీనియర్.. అంతేకాకుండా 2014 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు రాజాసింగ్. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనకే ప్రాథాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ ఎల్పీ నేత నియామకంపై పార్టీలో తొలుత సందిగ్ధత నెలకొంది. కానీ చివరికి రాజాసింగ్ వైపే అధిష్టానం మొగ్గు చేపించింది. కాగా ఎల్పీ నియామకంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజాసింగ్ అలకబూనిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రెండు, మూడ్రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News