బీఆర్ఎస్వన్నీ మోసపూరిత హామీలే.. : Srinivas Reddy

Update: 2024-02-09 06:25 GMT

గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు పదేళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొత్తం 250 అంశాలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వ మేనిఫెస్టోలో అన్నీ మోసపూరిత హామీలే ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు బస్సుల్లో మహిళలకు ఉచితం అంటే హేళన చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

దొంగ జీవోలతో బీఆర్ఎస్ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. సాగర్‌, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్‌ పార్టీనేని అందుకే అవి అంత బలంగా ఉన్నాయని గుర్తు చేశారు. అంతేగాక పదేళ్లుగా బీఆర్ఎస్ కట్టినవి వరుసగా కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్‌ మొండి చేయి చూపించారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వ పథకాలను ఎండగట్టారు.

Tags:    

Similar News