ఆ జీవోపై సీఎం రేవంత్కు ఎమ్మెల్యేల వినతిపత్రం

Update: 2023-12-21 15:01 GMT

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ చివరి రోజైన ఇవాళ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మల్యేలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెంబబర్ 46పై వినతిపత్రం సమర్పించారు. జీవో నుంచి కోడ్ నెం.24 TSSP(5000) మినహాయించాలని కోరారు. సీఎంను కలిసి వారిలో ఎమ్మెల్యేలు మందుల సామేల్, పద్మావతి రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ సీట్లు సాధించి అధికారం చేపట్టింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానల్లో 11 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా.. ఒక్కరూ మాత్రమే (సూర్యాపేట నుంచి జగదీశ్వర్ రెడ్డి) బీఆర్ఎస్ నుంచి గెలిచారు.




Tags:    

Similar News