Medigadda Barrage : అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు ఎమ్మెల్యేలు..

Byline :  Krishna
Update: 2024-02-12 14:31 GMT

తెలంగాణలో జల రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇరుకున పెడితే.. కేఆర్ఎంబీ అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్రమంలో రేపు ఎమ్మెల్యేలను మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యాక కొద్దిసేపు సభలో ఉంటారు. ఉదయం 10.30కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకుంటారు. దీనికి సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 3గంటలకు ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్ట్ విజిట్ తర్వాత సాయంత్రం 5 గటలకు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ తిరిగిరానున్నారు. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం రేపు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి రేపు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Tags:    

Similar News