తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికైన కొత్తగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో శాసన సభకి చేరుకున్నారు.మొదటి సారి శాసన మండలిలో అడుగుపెడుతున్న క్రమంలో నాంపల్లి నుంచి అసెంబ్లీ వరుకు బస్సులో టిక్కెట్ తీసుకోని ప్రయాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పధకంపై మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమరవీరుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా తనను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, ఇతర అగ్రనాయకులు శాసన మండలికి పంపించారని పేర్కొన్నారు. తాను పదేళ్లపాటు యువకుల పక్షాన పోరాటం చేశానని బల్మూరి వెంకట్ తెలిపారు. ఇప్పుడు ఆ యువ'కులం' సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా హామీ ఇస్తున్నానన్నారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య వున్నా తన దృష్టికి తీసుకు రావొచ్చునన్నారు. ఎప్పటికి తన కులం యువ'కులమే' అన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.