MLC K Kavitha : బీసీ కోటాపై.. పార్లమెంటులో కొట్లాడతాం : ఎమ్మెల్సీ కవిత

Byline :  Aruna
Update: 2023-09-25 12:32 GMT

ఎన్నికలు సమీపిస్తున్నాయనే భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‎లో పర్యటించిన కవిత బీసీ కోటాపై మాట్లాడారు. తప్పనిసరిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీల కోటాపై పార్లమెంట్‎లో పోరడతామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి అలవాటేనన్నారు కవిత. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‎నే గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు

నిజామాబాద్‎లో కవిత మాట్లాడుతూ..." ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు.పెద్ద ముందడుగు పడింది. మహిళలకు తక్షణ లాభం లేకపోవడం సోచనీయం. ఓబీసీ వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ఈ బిల్లు ఉండాలని కోరుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల క్రితమే ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి రెజల్యూషన్ పాస్ చేశాము. ఓబీసీలకు , మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పెట్టాలని కోరాము. కానీ ఆ రెండు వాగ్దానాలను కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. 6 నెలల్లో బీజేపీ ప్రభుత్వ కాలపరిమితి అయిపోతుంది. ఈ సమయంలో ఈ బిల్లును తీసుకురావడం దుర్మార్గం, ప్రజలను మోసగించడమే. ఎన్నికల కోసం చేస్తున్న స్టంట్‏గానే ప్రజలు భావిస్తారు. దీనివల్ల మహిళలకు లాభం లేదు. ఓబీసీలకు కూడా తక్షణ లాభం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఓబీసీ కోటా రావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. పార్లమెంటులో బీసీ కోటాపై పోరాడతాము. రాహుల్ గాంధీ సత్యదూరమైన మాటలు మాట్లాడతారు. ఇది కూడా అలాంటి విషయమే. . కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది"అని కవిత ధీమాను వ్యక్తం చేశారు.   


 


Tags:    

Similar News