చెట్టును ఢీకొట్టిన కారు.. ఎమ్మెల్సీకి తప్పిన పెను ప్రమాదం

Update: 2023-06-12 04:13 GMT

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బైక్ ను తప్పించబోయి ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కౌశిక్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.

సోమవారం ఉదయం కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్‌ సమీపంలో కౌశిక్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్ తెరచుకోవడంతో కౌశిక్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. చెట్టును గుద్దడంతో కారు పాక్షికంగా ధ్వంసమైంది.

Tags:    

Similar News