గవర్నర్ ప్రసగంలోని ఆ పదాలు తొలగించండి.. ఎమ్మెల్సీ కవిత లేఖ
Byline : Bharath
Update: 2023-12-16 14:03 GMT
గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో చేసిన ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు కవిత లేఖ రాశారు. ప్రసంగంలోని పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని కవిత మండలి చైర్మన్ ను కోరారు. ఈ క్రమంలో కవిత రాసిన లేఖపై మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీలోనూ గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ మొదలైంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.