అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే కవిత అస్వస్థతకు గురయ్యారు. నిత్యం రోడ్ షోలు, సభల్లో పాల్గొంటున్న ఆమె ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా శనివారం కవిత జగిత్యాల నియోజకవర్గ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
కవిత రోడ్ షో ఇటిక్యాలకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరగడంతో ప్రచార రథంపైనే స్పృహతప్పి పడిపోయారు. పక్కన ఉన్న నేతలు వెంటనే స్పందించి ఆమెకు సపర్యలు చేశారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు.