Mlc kavitha : రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన కవిత

Update: 2024-02-03 06:41 GMT

(Mlc kavitha) సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. 60 రోజుల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిందేంది అంటూ ప్రశ్నించారు. నిన్న మీటింగ్ అయిన ఖర్చు ఎంత, ఢిల్లీ టూర్లకు అయ్యే ఖర్యు ప్రభుత్వానికి కాదా అని అడిగారు. పార్టీ సభ కోసం ప్రభుత్వ నిధులను ఎలా వినియోగిస్తారని నిలదీశారు. రూ. 500కే సిలిండర్ ప్రారంభోత్సవానికి ప్రియంకా గాంధీని ఎలా పిలుస్తారంటూ అడిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియంకా గాంధీని పిలిస్తే నల్లబెలూన్లతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

వంద రోజుల వరకు ఓపిక పడతామని..తర్వాత కాంగ్రెస్ హామీలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పారు. ప్రజా దర్బార్ ఒక్క రోజు మురిపమేనని..సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే ప్రజాదర్బార్ లో పాల్గొని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలు రేవంత్ ను యూటర్న్ సీఎం అంటున్నారని అన్నారు. పాలన వీకేంద్రీకరణ జరగాలని మేం కోరుకున్నామని తెలిపారు. సీఎంగా కాన్వాయే వద్దన్న రేవంత్ ఇప్పుడు అన్ని కార్లలో ఎలా తిరుగుతున్నారని అడిగారు.

రేవంత్ కాన్వాయి వస్తే నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా అని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది సున్నా అని..అయినప్పటికీ కేంద్రం వివక్ష పై రేవంత్ ఎందుకు నోరు మెదపలేదని కవిత ప్రశ్నించారు.  


Tags:    

Similar News