MLC KAVITHA: జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉందిగానీ సిన్సియారిటీ లేదు : కవిత

By :  Krishna
Update: 2023-10-21 07:57 GMT

కాంగ్రెస్పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే బతుకమ్మ మీద గౌరమ్మకు బదులుగా లిక్కర్ బాటిల్ పెడతారని జీవన్‌ రెడ్డి చేసిన కామెంట్స్పై ఆమె ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉందిగానీ సిన్సియారిటీ లేదని విమర్శించారు. ఎన్నికల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు.

తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహ అనుబంధం ఉందని కవిత అన్నారు. సోనియా తెలంగాణ బలిదేవత అని.. వందలాది బిడ్డల చావుకు ఆమె కారణమయ్యారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలని కవిత ఎద్దేవా చేశారు. రాసిచ్చింది చదవడమే రాహుల్ పని అని.. తన స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News