కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్

By :  Bharath
Update: 2023-12-25 09:31 GMT

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆవిడ.. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందని ఆరోపించారు. డీఎంకే పార్టీ నేతలు దేశాన్ని విచ్చినం చేసేలా మాట్లాడుతుంటే.. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ చెప్పాలని అన్నారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ తన మౌనాన్ని వీడాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఇంకా కొంత సమయమే ఇస్తామని చెప్పారు. తగిన సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News