ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వారికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లోని గంగపుత్ర సంఘ సభ్యులతో కవిత భేటీ అయ్యారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో రూ.400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమ కేసీఆర్ నాయకత్వంలో రూ. 30వేల కోట్లకు చేరిందని కవిత చెప్పారు. దాన్ని మరింత పెంచేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని చెప్పారు.