గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం - ఎమ్మెల్సీ కవిత

By :  Kiran
Update: 2023-09-26 07:28 GMT

ఎమ్మెల్సీ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై తీరు బాధ కలిగించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం సంప్రదాయమని కవిత గుర్తు చేశారు. అయితే తమిళిసై మాత్రం రకరకాల కారణాలు చెబుతూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ హాలులో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా లేక బీజేపీ రాజ్యాంగం నడుస్తోందా అని ప్రశ్నించారు.

బడుగు బలహీనర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఆపటం ఎందుకని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్‌ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు.

Tags:    

Similar News