Kavitha Bathukamma song: బతుకమ్మ పండుగపై.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పాట
తెలంగాణ ఆడబిడ్డలంతా ఒకచోట చేరి తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుకాగా.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత జాగృతి రూపొందించిన బతుకమ్ పాటను కవిత విడుదల చేశారు. మొత్తం పది పాటలున్న ఈ ఆల్బమ్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఒక పాటకు కవిత కోరస్ అందించడం విశేషం. ‘ఒక్కొక్క ముత్యం నే నోముకుంది.. ఒక్క ముత్యం దార నే నోముకుందూ’ అంటూ లిరిక్స్ పాడగా.. ఆ పాట విన్న కవిత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం -
మన తెలంగాణ ఆత్మగౌరవ సంబరం... బతుకమ్మ 🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
బతుకమ్మ శుభాకాంక్షలతో
ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీ కోసంhttps://t.co/LSUBFMFhch
Singers:
Telu Vijaya, Padmavathi, Soumya , Sindhu and Kalvakuntla Kavitha
Music: Akhil,
Dop & Editing: Ajay kodam
Lyrics &… pic.twitter.com/dOts1yIdip