రేవంత్, ఈటలపై ఎమ్మెల్సీ కవిత సటైర్

By :  Kiran
Update: 2023-11-06 17:03 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ఎమ్మెల్సీ కవిత సటైర్ వేశారు. వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుంటే.. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు వారిద్దరూ బరిలో దిగుతున్నారని విమర్శించారు. వారికి మిగిలేది వాతలు మాత్రమేనని, ఫలితం రాదని, వారు మూడునాలుగు చోట్ల పోటీకి దిగినా అంతిమంగా గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన కార్యక్రమంలో పాల్గొన్న కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కవిత వెల్ కం చెప్పారు. బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో వారి కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడంతో పాటు తక్షణమే ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మోడీ వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి రాహుల్ గాంధీ వచ్చి మళ్లీ అవే మాటలు చెప్పిపోతారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులవి మొసలి కన్నీళ్లే తప్ప నిజమైన మాటలు కావని కవిత స్పష్టం చేశారు.




Tags:    

Similar News