రైతులపై ఎందుకంత కక్ష.. రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్..

Update: 2023-07-12 06:53 GMT

తెలంగాణలో రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారని, ఎందుకు కక్ష గట్టారని రాహుల్ ను ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

రైతులకు కేవలం 3గంటల కరెంట్ చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు విని షాక్ అయ్యాయని కవిత అన్నారు. ‘‘రాహుల్ గాంధీ జీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నారా ?’’ అని కవిత తన ట్వీట్‌లో ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి అన్నదాతకు అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News