ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. సోలాపూర్ లో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నారు. పుంజాల్ మైదాన్‌లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొననున్న ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడతారు. అంతకు ముందు దత్తవాడ నుంచి సాయంత్రం 5గంటలకు ప్రారంభమయ్యే బతుకమ్మ శోభయాత్రలో కవిత పాల్గొంటారు
సాయంత్రం 6గంటలకు అక్కల్కోట్‌రోడ్‌లోని పుంజాల్ మైదాన్‌ను శోభాయాత్ర చేరుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మలు తలకెత్తుకొని నగరంలోని ఆడబిడ్డలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని నిర్వాహకులు కోరారు.