తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. జాతీయ జెండాను ఎగరేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ పదో అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఫొటోను కవిత పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు #TelanganaTurns10 pic.twitter.com/uBuV5hjcDB
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 2, 2023