తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.. MLC కవిత

Update: 2023-08-13 03:48 GMT

ఓ వార్త పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ (Tweet) చేశారు. ‘‘కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో...ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న.. అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి.. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.. బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ’’.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత కోరారు.

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌కి సంబంధించిన బాలికల వసతి గృహంలో... బాలికపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు వార్తలు వచ్చాయి. సదరు వార్త పత్రిక కథనం ప్రకారం.. ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం వేసి.. హాస్టల్లోని విద్యార్థినులను వేధించాడు. ఆ అధికారి బలవంతపెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళుతున్న విద్యార్థినులు, హాస్టల్‌కు వచ్చాక, అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమంటున్నారు. కాగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసలీలలు నడుపుతున్నాడని ఆరోపణలున్నాయి. విద్యార్థినుల పట్ల ఆయన పాల్పడుతున్న ఆగడాలకు ఆమెతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం ఓ బాలిక.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో కనిపించింది. ఇది గుర్తించిన మిగతా అధికారులు మాట్లాడేందుకు వెళ్లగా.. ఆ బాలిక లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెరపోయారు. తర్వాత కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం పాలైందని, నెలసరి విషయంలోనూ సమస్యలు తలెత్తాయని సమాచారం. కాగా సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు, హెయిర్‌ బ్యాండ్లు ఈ అధికారి గదిలో కనిపించడం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News