నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

Update: 2023-06-14 14:41 GMT

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రెండు నుంచి నాలుగురోజులు పలు ఎంఎంటీఎస్ రద్దయ్యాయి. హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో లింగంపల్లి- హైదరాబాద్‌; హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 10 రైళ్లు; ఈ నెల 14-17 తేదీల్లో ఉందానగర్‌-లింగంపల్లి; లింగంపల్లి-ఫలక్‌నుమా; రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్లలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది

Tags:    

Similar News