తెలంగాణకు ఎల్లో అలర్ట్

Update: 2023-07-31 03:46 GMT

తగ్గాయి అని గట్టిగా ఊపిరి అయినా పీల్చుకోలేదు మళ్ళీ తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రానికి మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమదిశగా బలంగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న సామంత్రం కూడా మైదరాబాద్ ను వాన ముంచెత్తింది.

ఇవాళ, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈరోజు కొంచెం తక్కువే వాన పడే అవకాశం ఉన్నా... రేపు అంటే మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమొరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

నిన్న కూడా తెలంగాణాలో హైదరాబాద్ తో పాటూ చాలా జిల్లాల్లో వాన పడింది. సంగారెడ్డి, మేడ్చల్‌ , మెదక్‌ జిల్లా, యాదాద్రి జిల్లా , నిర్మల్‌ జిల్లా, కేశవరం , ఆలియాబాద్‌ , బండ మాదారంలో వర్షం కురిసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 55.91 సె.మీ వర్షపాతం నమోదయింది.

Tags:    

Similar News