తెలంగాణ రెండు పార్టీల మధ్య నలిగిపోతుంది.. మోదీ కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-03-16 07:35 GMT

నాగర్ కర్నూల్ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు రాక ముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని ప్రధాని అన్నారు. మళ్లీ ఎన్డీయే కూటమినే గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని ఈ సారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయిని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుంది అని మోదీ అన్నారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్,కాంగ్రెస్ రూపంలో రెండు విసురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పాడు చేసేశాయి.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ చేతులోకి వెళ్లిందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్ కర్నూల్ ప్రజలు ఈ సారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. బీఆర్ఎస్ పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుంనద్నారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారన్నారు. తెలంగాణలో కూడా దోపిడీ జరుగుతోందన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.

Tags:    

Similar News