గిరిజనుల మధ్య కొట్లాట పెట్టి కేంద్రం చలి కాచుకుంటోంది -MLC Kavitha
మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గిరిజన సంక్షేమంపై మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆమె మాట్లాడారు. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తోందని కవిత ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తోందని కవిత చెప్పారు. కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి పథకాల ద్వారా గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు. 4.5 లక్షల పోడు పట్టాలు పంపిణీ చేశామని తద్వారా 1.5లక్షల మంది గిరిజనులకు లబ్ది చేకూరినట్లు కవిత ప్రకటించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే ఖర్చుచేసేలా సీఎం కేసీఆర్ 2017లోనే ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ భవన్‌తో పాటు కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకోవడంతో పాటు రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించుకున్న విషయాన్ని కవిత ప్రస్తావించారు.