వెదర్ అలర్ట్.. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు

Update: 2023-06-20 13:31 GMT

మండుటెండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పది రోజులు ఆలస్యంగా రుతుపనాలు తెలంగాణలో ప్రవేశించాయి. దక్షిణ తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించినట్లు అధికారులు చెప్పారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలకు రుతుపవనాలు విస్తరించాయి. వాటి ప్రభావంతో హైదరాబాద్ లో అక్కడక్కడా చిరు జల్లులు పడే అవకాశముంది.

రుతుపవానాల ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం నుంచి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల సహా పలుచోట్ల వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. ఈ నెల 22 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపిస్తాయని అన్నారు.




Tags:    

Similar News