మూసీకి పెరిగిన వరద ఉద్ధృతి.. ప్రాజెక్టు 3గేట్లు ఎత్తివేత

Update: 2023-07-26 06:57 GMT

మూసీ నదికి వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసారాం బాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు కాలనీలకు చెందిన వారిని అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అలర్ట్గా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, పోలీస్ అధికారులు బ్రిడ్జి దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే బ్రిడ్జ్ ను మూసివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మరోవైపు వరద ప్రవాహం పెరగడంతో మూసీ ప్రాజెక్టు ఐదు గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 11వేల 45 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 9వేల 700 క్యూసెక్కులుగా ఉంది. బీబీనగర్ ప్రాంతంలో మూసీ వరద ప్రవాహం భారీగా పెరిగింది. రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రుద్రవెల్లి, జూలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News