లక్ష సాయం, తులం బంగారం.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరెన్నో

By :  Bharath
Update: 2023-11-16 08:16 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు మేనిఫెస్టోపై స్పెషల్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల ప్రకటనలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్.. మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించింది.

రాహుల్ గాంధీ నవంబర్ 17న నిర్వహిస్తున్న రాష్ట్ర పర్యటనలో భాగంగా.. ఆయన సమక్షంలో మేనిఫెస్ట్ ను విడుదల చేయనున్నారు. అమ్మ హస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్ వంటివి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచినట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు:

• జర్నలిస్ట్‌లకు మెట్రో ఫ్రీ.

• మీడియా కమిషన్ ఏర్పాటు.

• కల్యాణ లక్ష్మి కింద లక్ష సాయం, తులం బంగారం.

• రేషన్ ద్వారా సన్న బియ్యం.

• ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు

• అభయ హస్తం పథకం పునరుద్ధరణ.

• ఆర్ఎంపీ,‌ పీఏంపీలకు గుర్తింపు కార్డులు.

• ఎంబీసీలకు కార్పొరేషన్.

• ధరణి స్థానంలో భూ భారతి పేరుతో యాప్.

• విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.

• ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు.

• ఉద్యోగ కల్పన.

• ఆటో వాలాలకు ఆర్థిక సహాయం.

Tags:    

Similar News