Motkupalli Narasimhulu : దక్కని ఎమ్మెల్యే టిక్కెట్టు.. మోత్కుపలి నెక్స్ట్ స్టెప్ ఇదే..

Update: 2023-08-24 08:38 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా.. మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వారిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు.




 


దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్‌ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇస్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు.




 


భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సన్నిహితులు, అనుచరులతో మోత్కుపల్లి నర్సింహులు సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బిఆర్ఎస్ లో అవకాశం దక్కలేదు... కాబట్టి ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది. మోత్కుపల్లి బిఆర్ఎస్ ను వీడతారా? ఒకవేళ వీడితే ఏ పార్టీలో చేరతారు? అంటూ అప్పుడే రాజకీయ చర్చ మొదలయ్యింది.




Tags:    

Similar News