MP Laxman: బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోం..

Byline :  Veerendra Prasad
Update: 2024-02-19 06:02 GMT

పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు బీజేపీదే అని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. 17 సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని.. 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం అంటున్న కాంగ్రెస్... గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని, బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని పార్లమెంట్ బోర్డ్ మెంబర్ గా చెబుతున్నానన్నారు. బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదని చెప్పారు. కవిత కేసు విషయంలో విచారణ జరుగుతోందన్నారు.

కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిపైనా లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో విసిగిపోయి తమకు భవిష్యత్‌ ఉండదనే ఉద్దేశంతోనే కూటమి పార్టీలు, నేతలు బయటకు వస్తున్నారన్నారు. ఎన్నికల వేళ మునిగిపోయే నావ అయినటువంటి కాంగ్రెస్‌తో కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీతో అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది గాలివాటం గెలుపు అని సెటైర్లు వేశారు. మోసపూరిత హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

Tags:    

Similar News