బీఆర్‌ఎస్‌కు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌లోకి చేరిక !
బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలిపారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పటివరకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రంజిత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చెవేళ్ల నుంచి మళ్లీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలోనూ రంజిత్‌రెడ్డికే టికెట్ అని స్పష్టం చేశారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలు, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్‌ను కీలక నేతలు వీడుతున్నారు.
రంజిత్‌రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేదానిపై ప్రకటన చేయలేదు. కాని ఆయన కాంగ్రెస్ చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని టికెట్ ఖరారైంది. దీంతో ఇక్కడి నుంచి ఆయనకు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో రంజిత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జెడ్పీ చైర్మన్లు హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. కర్ణాటక డిప్యూటీసీఎం డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే.