Lachu Naik : రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్

Byline :  Bharath
Update: 2024-02-16 07:14 GMT

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. హాస్పిటల్ కు మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న దగ్గరనుండి లచ్చు నాయక్ రూ. 3 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. కచ్చితంగా లంచం ఇవ్వాల్సిందేనని లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో.. ముందుగానే ఏసీబీ అధికారులను రాపోలు వెంకన్న ఫిర్యాదు చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 16) లచ్చు నాయక్ ఇంట్లో డబ్బులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు పథకం వేసి వెంకన్నను పంపించారు. వెంకన్న.. లచ్చు నాయక్ కు డబ్బులు ఇస్తుండగా.. రైడ్ చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.




Tags:    

Similar News