TSPSC : పేపర్ లీకేజీ కేసులో నిందితులకు షాక్

Byline :  Krishna
Update: 2024-01-06 14:52 GMT

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఏడుగురు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగుర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో నిందితుల గైర్హాజరు పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నిందితులు కోర్టు విచారణకు రాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్‌ తేల్చింది. అప్పట్లో సుమారు 100 మందిని సిట్ విచారించింది.

కాగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చైర్మన్ జానార్ధన్ రెడ్డి సహా పలువురు కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. ఈ అంశంపై స్పీడ్ పెంచిన రేవంత్.. రెండు రోజుల క్రితం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. గంట సేపు జరిగిన ఈ సమావేశంలో తొలుత యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వాహణ గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఎస్పీఎస్సీలో జరిగిన లోటుపాట్లు, తప్పొప్పులను యూపీఎస్సీ ఛైర్మన్ దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళకు సహకరించాల్సిందిగా మనోజ్ సోనీని సీఎం కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News