బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. జాతీయ మహిళా కమిషన్ కీలక ఆదేశాలు

Update: 2023-06-08 13:15 GMT

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శేజల్ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరిజన్ డైయిరీ సీఈవో శేజల్ ఆరోపిస్తోంది. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై మహిళా కమిషన్ స్పందించింది. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. 15 రోజుల్లో దీనిపై అప్‌డేట్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా శేజల్‌ ఆత్మహత్యాయత్నంపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌ పోలీసులను కమిషన్ ప్రశ్నించింది.

ఇక ఈ ఆరోపణలకు సంబంధించి శేజల్ మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. బిజినెస్ మీటింగ్ పేరుతో పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఏర్పాటు చేశారని శేజల్ ఆ వీడియోలో ఆరోపించింది.ఎమ్మెల్యే క్వార్టర్స్ రూమ్ నెంబర్ 404లో బిజినెస్ మీటింగ్ అని మందు సిట్టింగ్ ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించింది. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని.. అయినా తన దగ్గర మరికొన్ని ఆధారాలున్నాయని వివరించింది. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని వాపోయింది.

Tags:    

Similar News