మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ భాగమైనట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపిన సంగతి తెలిసిందే. నవదీప్ పరారీలో ఉన్నాడని, అతని కేసులో ప్రమేయం ఉన్న నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో నవదీప్ ను ఏ29గా పేర్కొన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నవదీప్.. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఇవేవీ పట్టించుకోని పోలీసులు నవదీప్ పై కేసు నమోదు చేశారు. కాగా తాజాగా ఈ విషయంపై నవదీప్ తెలంగాణ హైకోర్ట్ ను ఆశ్రయించాడు. దాంతో నవదీప్ కు కోర్ట్ లో ఊరట లభించింది. కేసును పరిశీలించిన ధర్మాసనం నవదీప్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో నిర్మాత సుశాంత్ రెడ్డి, దేవరకొండ సురేష్ రెడ్డి, రాంచంద్, కురుపాటి సందీప్, కేపీ రెడ్డిలు ఉన్నారని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా షాడో సినిమా ప్రొడ్యూజర్ రవి ఉప్పలపాటి, కలహర్ రెడ్డి, ఇంద్రతేజ్, శ్వేత కార్తీక్ లు కూడా నిందితుడిగా తేలడంతో.. వాళ్లంతా పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు వేగంగా ముందుకు కదులుతుంది.