MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ ..కొత్త విషయాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్ రోడ్డు పై రెయిలింగ్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే దానికి ముందు లారీని ఢీకొట్టి ఉండచ్చని పోలీసులు చెబుతున్నారు. లారీని ఢీకొట్టి ఉండొచ్చని పొలీసులు చెబుతున్నారు. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టిందని, దీంతో కారు లారీకి ఇరుక్కుపోయి 100 మీటర్ల ముందుకు వచ్చిందని తెలుస్తోంది. అనంతరం రెయిలింగ్‌ను ఢీకొట్టిందని అంటున్నారు. కారు అతి వేగం, నిద్రమత్తు కారణమని అనుమాస్తున్నారు. లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఈమె ప్రయాణిస్తున్న మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉండడం ఇవన్నీ ఆమె ప్రమాదానికి కారణాలుగా చెపుతున్నారు. అయితే ఓ కంపెనీకి చెందిన సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న కారును వినియోగించడం, మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా ఆ మె మృతికి కారణమైనట్లు తెలుస్తోంది.
దీంతో పాటు డ్రైవర్ కాకుండా లాస్య నందిత పీఏ ఆకాష్ కారు నడిపినట్లు తెలుస్తోంది. సేఫ్టీ ఉన్న కారును వాడినా.. ఎక్స్‌పర్ట్ అనుభవం ఉన్న డ్రైవర్ అందుబాటులో ఉన్నా ఈ విషాదం తప్పేదని నిపుణులు అంటున్నారు.లాస్య పటాన్ చెరు ఉన్న తన అన్న వాళ్ళ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ దర్గని దర్శంచుకున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు.లాస్య నందిత మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న ఆమె సోదరి నివేదిత గుండెలవిసేలా రోదించారు. ‘సారీ రా’ అంటూకన్నీరుమున్నీరయ్యారు. అటు సికింద్రాబాద్లోని ఆమె నివాసంలోనూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అక్కడికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక లాస్య తండ్రి సాయన్న సైతం గత ఏడాది ఫిబ్రవరి 19 న మరణించగా..ఇప్పుడు ఏడాది కే కూతురు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలో పడేసింది. అధికార లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి కోమటి వెంకటరెడ్డి తెలిపారు