రాజయ్య వర్సెస్ నవ్య ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని నవ్య ఎమ్మెల్యే రాజయ్య, ఆమె భరత్తో పాటు మరో ముగ్గురిపై ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒప్పంద పత్రంపై తనతో బలవంతంగా సంతకం చేయామంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇరువురు సమస్యను పరిష్కరించుకున్నారు. దీంతో రాజయ్య గ్రామాభివృద్ధికి రూ.25లక్షలు ఇస్తామని, రూ.20లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముందుగా సర్పంచ్ నవ్య భర్తకు రాజయ్య రూ.7 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు అడిగితే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలని తెలిపారు. దీంతో పాటు రూ.20లక్షలు మళ్లీ అడిగినప్పుడు తిరిగివ్వాలని ఒప్పందపత్రంలో ఉందన్నారు. దీంతో సర్పంచి భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. అయితే ఎమ్మెల్యే తన భర్తను ట్రాప్ చేసి..తనతో సంతకం పెట్టమని ఒత్తిడికి గురిచేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యపై, పీఏ శ్రీనివాస్, ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నవ్య ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు భర్త ప్రవీణ్ కూడా పోలీస్ స్టేషన్ కు రావడం గమనార్హం.