olxలో కుర్చీ అమ్మబోయి.. లక్షలు పోగొట్టుకున్న నిమ్స్‌ డాక్టర్‌

Update: 2023-08-16 12:39 GMT

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ యుగంలో అమాయక ప్రజలను మోసం చేస్తూూ వాళ్లనుంచి లక్షలు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఓ ఉదంతం బయటపడింది. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్న ఓ వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. తన సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ చెయిర్ ను ఓఎల్ఎక్స్ లో అమ్మాలనుకున్న డాక్టర్.. కొద్ది రోజుల క్రితం ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అది చూసిన సైబర్ నేరగాళ్లు.. జితేంద్ర శర్మ పేరుతో డాక్టర్ కు ఫోన్ చేశారు.

ఫోన్ మాట్లాడిన వ్యక్తి తన పేరు జితేంద్ర అని.. కూకట్ పల్లిలో తనకు ఫర్నీచర్ షాప్ ఉందని చెప్పుకొచ్చాడు. తను ఆ కుర్చీ కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. కుర్చీ కొనేముందు డబ్బు పంపేందుకు తన క్యూఆర్ కోడ్ స్రాన్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఆ విషయం నమ్మిన డాక్టర్.. ఆ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్ ను స్నాన్ చేశాడు. అంతే.. ఇంకేముంది.. డాక్టర్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 2.58 లక్షలు దోచుకుని చెక్కేశాడు. దాంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ ఇచ్చిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News